గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, అధికారులు.. శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా గాండ్లపెంట మండలం తూపల్లి గ్రామంలో పర్యటించారు. తేలికపాటి వానకురిస్తేనే వీధులన్నీ బురదగుంటల్లా మారుతున్నాయని.. సర్పంచి, ఎంపీటీసీతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.